Spoken English In Telugu: 101 Tips.

Spoken English in Telugu
Spoken English from telugu

Spoken English In Telugu: 101 Tips:

Respond:

ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నవారికి సహాయం చేయడానికి అనేక పుస్తకాలు, ఆడియో క్యాసెట్లు డీవీడీలు, వీడియోకోర్సులు మార్కెట్లో ఉన్నాయి. గతంలో అయితే చాలా తక్కువ పుస్తకాలు ఉండేవి కాబట్టి నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్నవారికి పెద్దగా చాయిస్ ఉండేది కాదు. దొరికిన పుస్తకాన్ని కొనుక్కొని కష్టపడి చదివి ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.

లెక్కకు మించి పుస్తకాలు, Spoken English Institute లు, Online training లు ఇలా అనేక ఛాయిస్ లు ఉండడంతో విద్యార్థులలో కొంత Confusion కూడా ఏర్పడటం జరుగుతున్నది.

అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా కోచింగ్ సంస్థలో చేరడం, పుస్తకం కొనుక్కోవడంగాని, వీడియో కోర్సు కొనడం గాని చేయగానే “హమ్మయ్య… నా బాధ్యత తీరిపోయింది, నేను చేయగలిగింది నేను చేశాను ఇక మిగతా అంతా కూడా ఆ భగవంతుని దయ..” అన్న ఫీలింగ్ లో వుంటారు చాలామంది. మరికొందరు ఈ విషయాన్ని పైకి చెప్పకపోయినా కూడా పుస్తకాలు కొనుగోలు చేయడం, Bookshelf లో పెట్టుకోవడం, దాని వైపు చూడకపోవడం, మళ్లీ ఏమైనా అంటే “నేను చాలా కష్టపడ్డాను… చాలా try చేసాను, కానీ నాకు ఇంగ్లీష్ రావడం లేదు” అంటుంటారు.

సినిమాల్లో ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ICUలో ఉంటాడు. డాక్టర్లు తమవంతు కృషిచేస్తూ ఉంటారు. చివరికి బయటకొచ్చి విషాదంగా “మా ప్రయత్నం చేశాము….Treatment ఇస్తున్నాము, కానీ పేషెంట్ Respond అవ్వటం లేదు” అనడం జరుగుతుంది. ఇది చాలా important విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే Treatment కి పేషెంట్ రెస్పాండ్ అవుతుంటేనే, ప్రతిస్పందిస్తేనే ఆ వ్యక్తి తిరిగి కోలుకోగలుగుతారు, ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రతిస్పందించకపోతే డాక్టర్లు చేయగలిగింది కూడా ఏమీలేదు.

ఇక్కడ కూడా ఒక Book గాని, స్పోకెన్ ఇంగ్లీష్ Institute గాని, ఒక వీడియో కోర్స్ గాని డాక్టర్ల లాగా వారు చేయగలిగింది వాళ్ళుచేసే ప్రయత్నం చేస్తారు. కానీ దానికి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా student పైనే ఉంటుంది.

విద్యార్థులు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే టీచర్లు కూడా ఏం చేయలేరు. కాబట్టి ‘నా వంతు ప్రయత్నంగా నేను ఏం చేస్తున్నాను’ అని మీరు ఒక డైరీ రాసుకోండి. “ప్రతిరోజు మీరు ఎంత సమయం ఇంగ్లీష్ కి కేటాయిస్తున్నారు” అది మాట్లాడడానికి కావచ్చు, రాయడానికి కావచ్చు, గ్రామర్ నేర్చుకోవడానికి కావచ్చు,  Vocabulary కోసం కావచ్చు, స్పెల్లింగ్స్ కావచ్చు, ఇంకా ఏ విషయమైనా కావచ్చు, ప్రతిరోజు మీరు ఎంతసమయం కేటాయిస్తున్నారు? అనే విషయము note చేస్తూ ఉండండి. “ఈరోజు నేను ఒకగంట కేటాయించాను, ఈరోజు మూడు గంటలు కేటాయించాను” అనేదానిని Note చేస్తూ ఉండండి.

ఒక నెల తర్వాత Review చేయండి. విషయం ఏమిటనేది మీకు తెలిసిపోతుంది. ఒకవేళ ప్రతిరోజు మూడు నాలుగు గంటలు కష్టపడుతూ కూడా ఏమాత్రం Improvement లేకపోతే గనక మీ తప్పు ఏమాత్రంకూడా లేదు. అప్పుడు మీరు డాక్టర్లను మార్చాల్సి ఉంటుంది.

Start Small:

‘సరే…. ఇంగ్లీష్ పై పట్టు సాధిద్దాం’ అన్న దృఢనిశ్చయంతో మీరు సాధన మొదలు పెట్టారు. కాకపోతే మీ ఎదురుగా ఒక మహాసముద్రమే ఉంది. ఈ మహాసముద్రాన్ని ఈదాలంటే కొంత భయం కలగడం కూడా సహజం, కాబట్టి ఎంతోకొంత మొదలుపెట్టండి. చిన్నచిన్న అడుగులతోనైనా సరే….. ఒకేసారి భారీ ఎత్తున ఏదో సాధించేద్దాం అన్న భ్రమలో ఉండవద్దు. తప్పకుండా మీరు ఎంచుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కానీ కొంత సమయం మాత్రం తప్పకుండా తీసుకుంటుంది.

సందర్భానుసారంగా చిన్న Phrases ని ఉపయోగించండి:

 • Will you?
 • Could you….
 • Get in.
 • My pleasure.

ఇట్లాంటి చిన్న చిన్నphrases ని సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా Confidence అనేది build up అయి పెద్దవాక్యాలను కూడా ఉపయోగించగలుగుతారు.

Attitude:

ముందుగా ఇంగ్లీషులో మాట్లాడాలి అంటే మీకున్న భయాన్ని, సిగ్గుని, మొహమాటాన్ని పక్కన పెట్టాలి. ఎవరేమనుకుంటారో అన్న ఫీలింగ్ ఏమాత్రం కూడా ఉండకూడదు. నిజానికి అనేక సందర్భాల్లో మనకు ఇంగ్లీష్ లో మాట్లాడే అవసరము, అవకాశము వచ్చినా కూడా ఈ రెండు కారణాల వల్లనే మనం మాట్లాడకుండా ఉండిపోతాము.

గుర్తుంచుకోండి…….

మనని పైకి ఎదగనీయకుండా ఆపుతున్నది మనలో ఉన్న భయము, సిగ్గు మాత్రమే.

“మనకి మనమే శత్రువులము, మనకి వేరే శత్రువులు అవసరం లేదు.”

Surround yourself with English:

వీలైనంత మటుకు మీ చుట్టూ ఇంగ్లీషు మాత్రమే ఉండేలా జాగ్రత్తపడండి. ఇంగ్లీషు తప్ప మరే భాషా కూడా లేకుండా చేసుకోండి. గత్యంతరం లేని పరిస్థితులు ఎదురైతే తప్ప మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం పట్ల చిత్తశుద్ధితో focus చేయడం జరగదు. వేరే Option లేనప్పుడు, తప్పనిసరిగా ఇంగ్లీష్ లోనే మాట్లాడాల్సివస్తుంది.

Daily Activities:

ఇంగ్లీషు వాతావరణంలోకి ప్రవేశించాలి అని పైన చెప్పుకున్నాం కదా. దీనిలో భాగంగా కొన్ని Activities కూడా ప్రతిరోజూ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ చేయాల్సిఉండడం అంటే అవి తప్పనిసరిగా చేయాల్సిన పనులు. అంటే Optional పనులు కావన్నమాట.

‘చేసే చేద్దాము, లేకపోతే మానేద్దాం’ ఈరోజు కాకపోతే రేపు చేద్దాము వంటి ఆలోచనలు రాకుండా మన Daily routine లోకి ఈ Activities ని బలవంతంగా చొప్పించాలి.

కొన్ని పనులు మనము ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా ప్రతిరోజు చేస్తుంటాము. ఉదాహరణకి బ్రష్ చేయడం, స్నానం చేయడం, భోజనం చేయడం, మొబైల్ చూడటము ఇవన్నీ కూడా….

ఒకరోజు brush చేయకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఎంతో Uneasy గా ఉంటుంది కదూ. అలాగే ఇంగ్లీష్ Activities కూడా తప్పనిసరిగా చేసేటటువంటి పనుల జాబితాలోకి చేర్చి ప్రతిరోజు వాటిని చేస్తూ ఉండాలి. Activities అంటే ఏమిటి ఈ క్రింది వ్యాసం లో చూడవచ్చు.

ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోడానికి ఏదైనా ఒకే ఒక్క Formula ఉందా? అని ఎవరైనా అడిగినప్పుడు మేము చెప్పేది ఒక్కటే …అది ప్రాక్టీస్ చేయడం.

 ప్రాక్టీస్ …..ప్రాక్టీస్ …..ప్రాక్టీస్

ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మనము అంత బాగా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాము.

ఈ  వ్యాసంలో చెప్పుకున్నట్టు మాట్లాడటం అనేది ఒక Skill. ప్రపంచంలోని ఏ స్కిల్ అయినా సరే, ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది.

మరికొందరు ‘మేము ఎంత ప్రయత్నించినా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేక పోతున్నాము’ అని వాపోతుంటారు. మేము చెప్పేది ఒక్కటే…. మీరు తెలుగులోగాని మరి ఏ ఇతర భాషలో గాని ధారాళంగా మాట్లాడగలుగుతారా?

ఒకవేళ ‘అవును’ అన్నది కనుక సమాధానమైతే ‘మీరు తప్పకుండా ఇంగ్లీష్ లో కూడా మాట్లాడగలుగుతారు’. నిజమే …..మీరు ఏదైనా భాషలో ధారాళంగా మాట్లాడగలిగితే తప్పనిసరిగా ఇంగ్లీషులో కూడా మాట్లాడగలుగుతారు. కావలసిందల్లా ప్రాక్టీస్ చేయడం మాత్రమే.

 ఒకవేళ మీరు ఏ భాషలో కూడా ధారాళంగా మాట్లాడలేకపోయినట్లయితే ముందుగా మీరు మీ మాతృభాషపై దృష్టిపెట్టి దానిని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ తరువాత ఇంగ్లీష్ వైపు దృష్టిసారించాలి.

English vocabulary in Telugu:

మీరు మీ స్నేహితుడూ ఇంగ్లీషులో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.

మీ స్నేహితుడు మిమ్మల్ని ప్రశ్నించాడు.

“Did you go to market yesterday?”

మీరిలా సమాధానమిచ్చారు. “yes, I went to market yesterday, I wanted to buy some Brinjal, looked for it but couldn’t find it ,so brought some……………………………………………………………………..”

(మీరు మార్కెట్ కెళ్ళారు. వంకాయలు కొందామనుకున్నారు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి పాలకూర తీసుకొచ్చారు.)

మీరు మాట్లాడిన దాంట్లో వాక్య నిర్మాణం బాగుంది. చాలా బాగా ప్రారంభించారు. కానీ చివర్లోకి వచ్చే సరికి పాలకూరను ఇంగ్లీషులో ఏమంటారో జ్ఞాపకం రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆ వాక్యాన్ని పూర్తి చేయలేకపోయారు. ఇంత చిన్న పదం కూడా తెలీనందుకు మీకు కాస్త ఇబ్బందిగా కూడా అనిపించింది.

ఇది మీ ఒకరి సమస్యే కాదు. ఇంగ్లీషు నేర్చుకోవాలనుకుంటున్న చాలామంది సమస్య. కష్టపడి sentence framing చేయగలుగుతాం కానీ ఎక్కడో ఒకచోట సరైన ఇంగ్లీషు పదం తెలీక మన మాటలకి బ్రేకులు పడిపోతాయి. అలా బ్రేకులు పడకుండా మాట్లాడాలి అనుకుంటే తెలుగు పదాలకి సమాన అర్థాన్నిచ్చే ఇంగ్లీషు పదాలు వీలయినన్ని ఎక్కువ మనకి తెలిసి ఉండాలన్న మాట.

అంటే ఇంగ్లీషులో మీ పదజాలాన్ని (Vocabulary) పెంచుకోవాలన్నమాట. అలా అని Dictionary లో ఉన్న అన్ని పదాలను ఔపోసన పట్టాల్సిన అవసరం లేదు కానీ తరచూ ఉపయోగించే వర్డ్స్ మాత్రం తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలి.

దీనికి ఒక మంచి పద్ధతి ప్రతీరోజు 5 కొత్త పదాలు (New words) నేర్చుకోవడమే. రోజుకి 5 వర్డ్స్ అంటే పెద్ద కష్టమేమీ కాదు. చాలా సులువుగా చేయగల task ఇది. అయితే మనకొచ్చిన సమస్యల్లా మోటివేషన్ అనేది స్థిరంగా ఉండకుండా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. ఇలా రోజుకి 5 కొత్త పదాలు నేర్చుకోవడమనేది కొన్ని రోజుల వరకు బాగానే నడుస్తుంది. కొత్త పదాలు అప్పుడప్పుడే వంటపడుతూంటాయి. అనుకోకుండా ఓ రోజు మన మోటివేషన్ చప్పున పడిపోతుంది (కారణాలు ఏవైనా కానీ). ఇక అంతే ఆ రోజు నుండి 5 words నేర్చుకోవడం అనే ఈ చిన్న టాస్క్ ని తప్పించుకోడానికి రకరకాల కారణాలు, కుంటి సాకులు చెప్పడం మొదలవుతుంది. చివరికి ఈ టాస్క్ ని అసంపూర్తిగా మధ్యలోనే వదిలిపెట్టడం జరుగుతుంది.

అందుకే అవసరమైతే రోజూ నేర్చుకునే వర్డ్స్ సంఖ్య తగ్గించుకున్నా పరవాలేదు కానీ మధ్యలోనే మానేయడం మాత్రం సరయినది కాదు.

రోజుకి 5 పదాలు నేర్చుకోవడమనేది నిజానిక్ ఓ వ్యక్తి Vocabulary improvementకి సరిపోదు. మరీ ముఖ్యంగా ఇంగ్లీషుకి సంబంధించిన పోటీ పరీక్షలు రాసేవారికి, Business Englishపై పట్టు సాధించాలనుకునే వారికి ఏ మాత్రం సరిపోదు. అందువల్ల వారు తమ స్థాయికి తగ్గ పదాల సంఖ్యను తామే నిర్ణయించుకోవడం మంచిది.

అంతేగాక రోజుకీ ఎన్ని words నేర్చుకున్నా కూడా వాటిని మళ్ళీ మళ్ళీఉపయోగించనిదే గుర్తుంచుకోవడం కష్టం. వాటిని మరిచిపోకుండా ఉండాలంటే ప్రతీ రోజు సంభాషణల్లో మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తూ ఉండాలి. “out of sight, out of mind” అనే proverb ని మీరు వినే ఉంటారు. అంటే కళ్ళ ముందు అప్పుడప్పుడూ కనబడుతుంటేనే అది memory లో నాటుకుని స్థిరంగా ఉంటుంది. లేదంటే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కనుక మరిచి పోవద్దు అని బలంగా అనుకుంటే నేర్చుకునే wordsని తప్పనిసరిగా తరచూ revise చేస్తూండాలి.

పదాలు, వాటి meaning నేర్చుకునే సమయంలో ఒకదాని meaning మరోదాని పై overlap అయిపోయి ఏ meaning ఏ word దో తెలీని అయోమయ స్థితి ఎదురవ్వొచ్చు. దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేర్చుకున్న wordsని తరచూ మాటల్లో ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

ఇప్పుడు మీకో రెండు చిన్న ప్రశ్నలు.

ఇంగ్లీషులో

 • పౌర్ణమిని ఏమంటారు?
 • గుస గుసని ఏమంటారు?     

ఖాళీ సమయంలో కూర్చుని ఉన్నప్పుడు తెలుగు పదాలకి సమానమైన ఇంగ్లీషు wordsని గుర్తుకు తెచ్చుకోవడం ఒకింత సులభమే. ఇంగ్లీషులో ఏదైనా రాసే సమయంలో ఇలా పదాలు గుర్తుకు వస్తుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ వెంటనే గుర్తుకు రాక పోయినా కొద్దిసేపు ప్రయత్నం చేస్తే తప్పకుండా Recall చేయగలుగుతాము. కానీ మాట్లాడేటపుడు మనకి recall చేసేంత సమయం ఉండదు. మాట్లాడేటపుడు మధ్యలో, “word గుర్తుకు రావడం లేదు ఒక నిముషం time తీసుకుంటాను” అంటే ఏమైనా బాగుంటుందా?

కాబట్టి వర్డ్స్ ని గుర్తుపట్టడం కాదు అవి సమయానికి గుర్తుకు వచ్చేలా ప్రాక్టీసు చేయాలి.  New moon అంటే అమావాస్య అని చాలామంది చెప్పగలరు. అయితే ఇంగ్లీషులో మాట్లాడేటపుడు అమావాస్య అనే topic వచ్చినపుడు టక్కుమని వెంటనే new moon అనే word జ్ఞాపకం రావాలి. అదీ సరైన పద్ధతి.

How to improve English vocabulary in Telugu?

1. ఒక మంచి Vocabulary Improvement పుస్తకాన్ని కొనుగోలు చేసి దాన్నుండి రోజుకి కొన్ని words నేర్చుకోవచ్చు.

2. ఇంట్లో మీకు అందుబాటులో ఉన్న మంచి Dictionary or thesaurus సాయంతో కూడా ప్రారంభించవచ్చు. వీలయినంత మటుకు Visual thesaurus కే ప్రాధాన్యతనివ్వండి. బొమ్మల ద్వారా నేర్చుకునేదేదైనా అంత తొందరగా మరిచిపోవడం జరగదు.

3. ప్రతీరోజు email చూసుకునే అలవాటు, అవకాశం గనక ఉంటే చాలా sites “One word a day” services ను ఉచితంగా అందిస్తున్నాయి. ఈ services కి మీరు subscribe చేస్తే ప్రతీరోజు ఓ ఖచ్చితమైన సమయానికి ఓ కొత్త word, అర్థం, ఉదాహరణలతో సహా మీ మెయిల్ కి పంపించడం జరుగుతుంది. పేపర్, పెన్ను ఉపయోగించే అవసరం లేకుండా కొందరికి ఇది సౌకర్యంగా ఉంటుంది.

ఇలాంటి సేవలు అందించే కొన్ని web services.

Spoken English In Telugu: 101 Tips.

ఓపిక:

మీరు ఇంగ్లీషులో మంచి పట్టు సాధించాలంటే ఓపిక కూడా అవసరం. ఎందుకంటే ఇది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని, నెమ్మదిగా సాధన చేస్తూ ఉంటే మీయొక్క Speaking skills, Writing skills, Grammar, Vocabulary, English Grammar with Telugu….. ఇవన్నీ కూడా మెరుగవుతాయి.


Spoken English in Telugu free pdf:

ప్రారంభస్థాయిలో ఉన్నవారు కామిక్స్, పిల్లల బొమ్మల పుస్తకాలు (చందమామ లాంటివి) చదవచ్చు. దాని Links కింద ఇవ్వబడ్డాయి. విజ్ఞానంతో పాటు సరదాగా కూడా ఉండే ఒక ఆక్టివిటీ ఇది.

http://chandamama.in/english/

Memorize chunks :

chunks అంటే groups of words (పదాల సముదాయం). ఈ పుస్తకంలో chunks, phrases, sentences ని ఒకే అర్థంలో వాడటం జరిగింది.

Adult స్థాయికి వచ్చినతర్వాత, ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవాల్సివచ్చినప్పుడు, Phrases గా, Sentences గా నేర్చుకోవాలే తప్ప Words చొప్పున నేర్చుకోవాలనుకోవడం సరికాదు. కొన్ని Words ని కలిపితే మనకు Phrases, Sentences వస్తాయి. కాబట్టి ఇకనుంచి మీరు వర్డ్స్ పైన కాకుండా Phrases, Sentences పైన మాత్రమే దృష్టిపెట్టండి. వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి.

chunks కి ఉదాహరణలు.

 • Do you understand?
 • In my opinion
 • As a matter of fact
 • Once upon a time

Spoken English Phrases:

ఒక ఇంగ్లీషు phrase ని అర్థంతో సహా నేర్చుకున్నపుడు మళ్ళీ మరిచిపోకుండా దాన్ని బ్రెయిన్ లో స్థిరంగా పాతుకుపోయేలా చేయాలంటే వెంటనే ఆ phrase ని ఉపయోగించడం మొదలుపెట్టాలి. అంటే వీలయినంత త్వరలో మీ సంభాషణల్లో ఉపయోగించడం ప్రారంభించాలి. అయితే మీరు అనుకున్నంత వెంటనే ఆ phrases ని ఉపయోగించే సందర్భం మీ సంభాషణల్లో రాకపోవచ్చు. కాబట్టి సందర్భం కుదిరినా కుదరకపోయినా, అవసరమైతే సందర్భాన్ని సృష్టించయినా సరే తప్పనిసరిగా వాటిని ఉపయోగించాలి.

 Get Exposure:

మీ చుట్టూ English వాతావరణాన్ని స్వచ్చందంగా మీరే సృష్టించుకోవాల్సి ఉంటుంది. మీకు అనేక రూపాలలో ఇంగ్లీష్ ప్రతీరోజు తారసపడుతూన్నప్పటికీ తెలిసో తెలియకో ఆ వాతావరణంలోకి ప్రవేశించడానికి ఇష్టపడక మన comfort zone అయిన తెలుగులోనే ఉండడానికి ఇష్టపడతాము. Comfort Zone వదిలి బయటికి రావాలనిపించదు. Comfort Zone లో సుఖంగా హాయిగా ఉంది, బయటకి వస్తే ఏమవుతుందోనని భయం.

“A ship is safe in harbor, but that’s not what ships are for.”

safety అనేది అందరికీ ఇష్టమైన పదం, కానీ కేవలం safety పైనే దృష్టి పెడితే జీవితంలో ముందుకు వెళ్ళలేము.

ఏదో సందేహం క్లియర్ చేసుకోడానికి మీరు మీ మొబైల్ network customer careకి ఫోన్ చేసారు. అక్కడ IVRS (Interactive Voice response System) తెలుగుకై ఒకటి నొక్కండి, ఇంగ్లిషుకై రెండు నొక్కండి అని అడుగుతుంది. చప్పున ఆలోచించకుండా మీరేది ఎంచుకుంటారు?

 తెలుగే కదా!

 ఇదే Comfort Zone. ఎప్పుడైనా తెలుగుకి బదులు ఇంగ్లీషులో మాట్లాడుదామన్న ఆలోచన వచ్చిందా? ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తెలుగుకి బదులుగా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీషులో సంభాషించండి. సంభాషణ అయింతర్వాత మీ confidence లెవెల్స్ ఎంతగా పెరుగుతాయో మీకే తెలుస్తుంది. అయితే “నేను ఇంగ్లీషులో మాట్లాడగలుగుతానా లేదా?” అన్న సందేహం బలంగా ఉన్నప్పుడు మాత్రం ముందే ఓ రెండు నిముషాలు కేటాయించి ప్రశ్నలు ఏ విధంగా అడగాలి అని ప్రాక్టీసు చేయడం మంచిది.

call center వారితో ఇంగ్లీషులో మాట్లాడటంలో రెండు సౌలభ్యాలున్నాయి.

 • మీరు తప్పు మాట్లాడినా కూడా వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం.
 • ఒకవేళ దురదృష్టవశాత్తు మాట్లాడలేని స్థితి వస్తే వెంటనే చప్పున call ముగించవచ్చు.

ఈ ఒక్కటే కాకుండా కాన్వెంట్ స్కూల్ టీచర్స్ , ప్రిన్సిపాల్ తోగానీ door to door salesmen తో గానీ సంభాషించడం మొదలుపెట్టడం ద్వారా సరైన exposure పొందగలుగుతారు.

English club:

మామూలు మిత్రులతో సందర్భం లేకపోయినా మనం నేర్చుకుంటూన్న phrases ని వాడుతూంటే వారు దానిని అసందర్భ ప్రేలాపనగా భావించే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది నుండి బయట పడటానికి ఒక మంచి పరిష్కారం, ఒక English Club ని ఏర్పాటు చేసుకోవడమే.

ఇంగ్లీష్ club అనగానే “క్లబ్బా! అబ్బో ఇది అయ్యే పనేనా! ఇదో పెద్ద ప్రహసనం !” అని మీరు అనుకోవడం సహజం. అయితే ఇక్కడ కొన్నివిషయాలు….

club అనగానే ఒక పెద్ద బిల్డింగూ, దానికొక బోర్డూ, ఓ వంద మంది సభ్యులూ …ఇలా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కనీసం ముగ్గురు సభ్యులుంటే చాలు English Club ని ప్రారంభించవచ్చు. మీరు కాకుండా ఇంకా కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య రెండు. ఇది కనీస సభ్యుల సంఖ్య మాత్రమే. ఇంతకన్నా ఎక్కువ మంది సభ్యులు ఉంటే మరీ మంచిది.

ఇంత విశాల ప్రపంచంలో మీలా ఇంగ్లీషు నేర్చుకోవాలన్న తపన ఉన్న వ్యక్తులు మరో ఇద్దరు లభించడం కష్టమని నేననుకోను. కాస్త మనసు పెట్టి వెతికితే చాలా సులువైన పనే. కాకపోతే ఆరంభ శూరత్వం ఉన్న వారిని కాకుండా మొదలు పెట్టిన పనిని చివరివరకూ కొనసాగించగల స్థిరమైన పట్టుదల ఉన్నవారిని ఎంపిక చేసుకోవడం మంచిది.

 • చిన్న చిన్న సంభాషణలతో మొదలుపెట్టాలి.
 • వీలయినన్ని తక్కువ రూల్స్ ఏర్పరచుకోవాలి.
 • అమలు చేయడానికి  వీలుకాని రూల్స్ అస్సలు ఏర్పాటు చేసుకోవద్దు.
 • కేవలం ఇంగ్లీషు పైనే దృష్టి పెట్టకుండా అప్పుడప్పుడు motivation పెంచుకోవడం పై కూడా దృష్టి పెట్టాలి.
 • నెలకో సారి అందరూ కలిసి కూర్చుని communication, activities ఎలా ఉండాలో ఒక్కసారి చర్చించి design చేసుకుంటే బాగుంటుంది.
 • కొన్ని grammar books, కొన్ని audio books, వీలైతే ఓ  iPod, speakers, head phones ఉంటే మంచిది.

club ఏర్పాటు మీ వల్ల కాదనుకుంటే online లో ఇదివరకే ఉన్న club లలో మీరు చేరవచ్చు.

Spoken English Practice in Telugu:

ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడే స్థాయికి చేరుకోవాలంటే అవసరమైన మూడు ప్రధాన అంశాలు.

 • 1. ఇంగ్లీష్ పరిజ్ఞానం
 • 2. Self Confidence
 • 3. Practice.

ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నంలో self confidence అనేది ఒక కీలకమైన అంశం. ధారాళంగా మాట్లాడాలనే ఈ సంకల్పంలో మీకు లభించే ప్రతి చిన్న విజయం కూడా ఒక ఉత్ప్రేరకంగా పని చేసి మీ confidence లెవెల్స్ ని మరింత పెంచుతుంది.   అలాగే దానికి భిన్నంగా ఎదురయ్యే ఒక్కో అపజయం మీ ఆత్మ విశ్వాసపు పునాదుల్ని కూలదోసి “ఇది మనవల్ల అయ్యే పని కాదురా “అని నిరుత్సాహపడి ఆ ప్రయత్నాల నుండి విరమించుకునేలా చేస్తుంది.

ఇంగ్లీషు మాట్లాడటంలో సాధారణంగా కలిగే అపజయాలు ఏమిటి?

 • మాట్లాడేటప్పుడు తడబడటం
 • ఎంత ప్రయత్నించినా ఆ వాక్యం పూర్తి చేయడం సాధ్యం కాక మధ్యలోనే ఆపేయాల్సి రావడం
 • చుట్టూ ఉన్నవారు నవ్వడం (మన గురించేనా!)
 • ఇంగ్లీషులో మాట్లాడలేక మధ్యలోనే తెలుగులోకి వచ్చేయడం
 • ముఖాముఖి సంభాషణల్లో ఎదుటి వ్యక్తి ఇంగ్లీషులో చక్కగా మాట్లాడుతున్నపుడు మనకు న్యూనతగా అనిపించడం
 • కాళ్ళు చేతులు వణకడం, మొ.వి.
 • writing స్కిల్స్ బ్రహ్మాండంగా ఉండి మాట్లాడే విషయానికి వొచ్చేసరికి తేలిపోవడం.

ఈ పై అంశాల్లో కొన్ని ఇబ్బందులను భాషను పట్టుదలతో నేర్చుకోవడం ద్వారా, fluency ని మెరుగు పరిచే activities ద్వారా, మరి కొన్నింటిని ఆత్మ విశ్వాసం ద్వారా, body language ను మెరుగు పరుచుకోడం ద్వారా అధిగమించవచ్చు.

ఇవే కాకుండా పైన చెప్పిన అపజయాలకు దూరంగా ఉండాలనుకుంటే తప్పనిసరిగా మీ వద్ద ఒక పాశుపతాస్త్రం ఉండాలి. దాని పేరే Practice“.

దురదృష్టవశాత్తు చాలా మంది ఔత్సాహికులు practiceను నిర్లక్ష్యం చేస్తారు. మీకు అదివరకే writing స్కిల్స్ , vocabulary మొదలైన అంశాలలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ, ప్రాక్టీసు చేయకుండా నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తే గనక లేక ఒక ఉపన్యాసం/Presentation ఇవ్వడం చేస్తే గనక అపజయం కలగడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.  ఒక్కసారి ఓటమి ఎదురయ్యిందంటే మీరు మోటివేషన్ అంతా కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ప్రాక్టీసు చేయడమే ఏకైక మార్గం.

How to Practice English Conversation?

1.Alone              2.గ్రూప్                3.Online

Alone: ఇంగ్లీష్ మాట్లాడటంలో మీరు ప్రాథమిక స్థాయిలో ఉంటే గనక చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుతూ ఒంటరిగా ప్రాక్టీసు చేయడం ప్రారంభించాలి. ఒకసారి వాక్యాల మీద కొంత పట్టు ఏర్పడినతర్వాత ఇతరులతో సంభాషణలు మొదలు పెట్టవచ్చు.

అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ సంభాషణలు ప్రాక్టిసు చేయడం ఒక విజయవంతమైన టెక్నిక్. అయితే అద్దాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. Mirror ని ఉపయోగించడం వల్ల Body language, ఉచ్చారణ సమయంలో పెదాల కదలిక పై దృష్టి సారించవచ్చని కొందరి వాదన కాగా, బాడీ లాంగ్వేజ్ పై అనవసరంగా దృష్టి కేంద్రీకరించబడి అసలు విషయం మరుగున పడిపోతుందని మరి కొందరి ఆర్గ్యుమెంట్. కాబట్టి చివరగా చెప్పేదేమిటంటే Mirror ముందు, Mirror లేకుండా రెండు రకాలుగా ప్రాక్టీసు చేయండి. మీకు ఏది బాగా అనిపిస్తే అది Continue చేయవచ్చు.

మీ అంతట మీరే ఒంటరిగా ప్రాక్టీసు చేస్తూన్నపుడు మీకు కావాల్సిన అతి ముఖ్యమైన టూల్ Voice Recorder. ఇది మనకి కొత్తేమీ కాదు. ఈ రోజుల్లో ప్రతీ మొబైల్ ఫోనులో ఉంటుంది. దీనితో పాటు మంచి నాణ్యత ఉన్న Ear Phonesను కూడా ఉపయోగించడం మంచిది.

ప్రాక్టీసు చేస్తూన్న సమయంలో మీ Voice ని రికార్డు చేసి Ear Phones సాయంతో ఆ రికార్డింగ్స్ ని మళ్ళీమళ్ళీ వింటూ ఎక్కడ తడబడుతున్నారో గుర్తించి, నెక్స్ట్ ప్రాక్టీసులో ఆ లోపాలని సరిదిద్దుకోవాలి. ఒకవేళ ఇప్పటివరకూ Voice Recorder ని వాడకపోయినా ఈ రోజు నుండి ఉపయోగించడం మొదలుపెట్టండి.

ముఖ్యంగా….. Situational English నేర్చుకోండి.

Situational ఇంగ్లీష్ అంటే రెస్టారెంట్ లోగాని, షాపింగ్ లోగాని, హాస్పిటల్ లోగాని, రైల్వేస్టేషన్లో గానీ ఎలాంటి వాక్యాలను ఉపయోగిస్తాము, ఎలాంటి ప్రశ్నలు అడగడం జరుగుతున్నది? దానికి సమాధానం ఎలా చెప్పాలి? ఇలాంటివి ముందుగా నేర్చుకోవాలి. అంటే ఇవి Real life Situational అంటే నిజజీవితంలో డైరెక్టుగా ఉపయోగపడేవి. వీటికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి.

“Listen and repeat” Method:

ఇంగ్లీష్ నేర్చుకోవడానికి worldwide గా పాపులర్ అయినటువంటి టెక్నిక్ “Listen and repeat” Method. Spoken English from Telugu: 101 Tips.

 Listen and repeat అంటే…

విన్నదానిని యధాతధంగా మళ్లీ అంటూ నేర్చుకోవడం. ఇది ఒకరకంగా అనిపించినా కూడా మంచి శక్తివంతమైన టెక్నిక్. ఎందుకంటే మనం వింటున్నాము అంతేకాక అదే సమయంలో తిరిగి అనడం కూడా జరుగుతున్నది. కాబట్టి ఎక్కువకాలం గుర్తుండిపోయే ఒకమంచి టెక్నిక్ అన్నమాట. దీనికోసం అనేక Podcast లు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా వీటిని వినొచ్చు. Download చేసుకోవచ్చు.

 కింద కొన్ని లింక్స్ ఇవ్వబడ్డాయి.

Spoken English by Telugu – Fillers:

Fillers అంటే మాట్లాడుతున్నప్పుడు సమయానికి ఒక పదం గుర్తుకురానప్పుడు, అది గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉండగా, ఆ గ్యాప్ ను కవర్ చేస్తూ మనం ఉపయోగించేటటువంటి పదాలను Fillers అంటాము.

ఉదాహరణకు…

 • You know…
 • Actually…
 • What I mean is…

Tell a story in English:

కథలు చెప్పడమంటే, వినడమంటే  ఎవరికి ఇష్టం ఉండదు?

కథలంటే చిన్న పిల్లలకు ఇష్టమైన చందమామ కథల నుండి సినిమా కథల వరకు ఏదైనా తీసుకోవచ్చు. అన్నింటికన్నా సినిమా కథ చెప్పడం ఈజీ. చాలా సార్లు చూసిన సినిమా అయితే మరీ మంచిది. తడుముకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కథ చెప్పినా కూడా Simple Present tense లోనే చెప్పాలి. అలాగే జరిగిన ఓ సంఘటనని Narrate చేయడం కూడా బాగా work out అవుతుంది. ఇలా narrate చేయడం మనం దాదాపుగా ప్రతీ రోజు చేసేదే, కానీ ఇంగ్లీషులో చెప్పాల్సి రావడం కొద్దిగా అలవాటులేని పని. అయినా ప్రాక్టీసుతో అలవాటయిపోతుంది. జరిగిన సంఘటనలని చెప్పాల్సి వచ్చినపుడు Simple Past tense వాడాలి.

ప్రతిరోజు వార్తలు వినండి:

ముఖ్యంగా రేడియో వార్తలను వినండి. టీవీ వార్తలకంటే రేడియో వార్తలు చాలా సహాయ పడతాయి. ఎందుకంటే మనం distract కాకుండా, మన Senses కేవలం వినడంపైనే Focus చేస్తాము. అదే.. టీవీ చూసేటప్పుడు కళ్ళు కూడా పనిచేస్తుండటం వల్ల visual గా కొంత distract అయ్యే అవకాశం ఉంది.

http://www.newsonair.com/

మరికొంతమంది చేసే ఫిర్యాదు ఏమిటంటే ‘మాకు ఇంగ్లీష్ మాట్లాడటం ప్రాక్టీస్ చేయడానికి ఎవరు తోడుగా లేరు. మరి ఎవరితో మేము ప్రాక్టీస్ చేయాలి’ అని అంటుంటారు. ఈ సమస్యని ఉద్దేశించి ఒక చిన్న వీడియోను రూపొందించాము. అది చూడండి.. మీకు ఉపయోగపడవచ్చు.

Reading English Newspaper:

ఈ సలహానైతే మనం ఎన్నిసార్లు విని ఉంటామో. బహుశా కొన్నిసార్లు మొదలుపెట్టి మానేసి కూడా ఉండవచ్చు. మొదటి ప్రయత్నంలోనే మొత్తం పేపర్ ని చదివే ప్రయత్నం చేస్తే అది మొత్తానికే బెడిసికొట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రారంభంలో మొత్తం Newspaper అంతా చదవాల్సిన అవసరం లేకుండా కేవలం 3,4 వార్తలతో, అదీ మీకిష్టమైన Sports, Movies, Cartoon, Recipe లాంటి టాపిక్స్ తో మొదలు పెట్టండి.

పేపర్ చదివే కొత్తలో ప్రతీ Word కూడా కష్టంగా అనిపిస్తుంది. ప్రతీ Wordకి Dictionary చూడాలేమోనన్న సందేహం కూడా కలుగుతూంది. అయితే ఈ విషయం గురించి అంత Worry కావాల్సిన అవసరం లేదు. మామూలుగా ప్రతీ Newspaper కి Vocabulary విషయంలో ఓ స్టైల్ ఉంటుంది. కొన్ని రోజులు గడిచేసరికి ఆ పత్రికలో రెగ్యులర్ గా ఉపయోగింపబడే పదాలు మీకు అలవాటయి పోతాయి. కష్టమైన words కనిపించినప్పుడల్లా ఓ నోట్ బుక్ లో రాసుకోవడం అన్నింటికన్నా మంచి పద్ధతి.

అంతేగాక దాదాపు అన్నిnewspapersకి Epaper version వచ్చిన ఈ రోజుల్లో మీకు నచ్చిన topics, నచ్చిన పేపర్ లో చదివేయడం ఎంతో సులువు. Mobile లో,  Newshunt app లో అనేక ఇంగ్లీష్ పత్రికలు అందుబాటులో ఉన్నాయి, మీరు ప్రయత్నించి చూడవచ్చు.

Think in English:

ఖాళీగా మీరు ఒక్కరే ఉన్నప్పుడు, ఇంగ్లీషులో ఆలోచించడం అనే activity చేయవచ్చు. అంటే మీ మనసులోకి ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో వాటిని ఇంగ్లీష్ లోకి మార్చే ప్రయత్నం చేయండి. దీనివల్ల బుర్రకు కూడా పని చెప్పినట్టు అవుతుంది. అయితే మీ Fluency Development కి మాత్రం ఈ activity ఉపయోగపడదు. ఎందుకంటే Fluency పెరగాలంటే తప్పనిసరిగా మీరు నోరు నోరువిప్పి మాట్లాడాల్సిందే. ఈ activity వల్ల ఇంగ్లీషులో వాక్యాలను నిర్మించడం, vocabulary సెలెక్ట్ చేసుకోవడం లాంటి విషయాల్లో పట్టు సాధించగలుగుతాము.

Spoken English through Telugu mp3 files:

ప్రతిరోజు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినట్లయితే, ఆ సమయంలో ఉచితంగా లభించేటటువంటి Audio books Download చేసుకుని వినవచ్చు. ఒకసారి Download చేసుకున్న పుస్తకాన్ని చాలా రోజులవరకు వినవచ్చు. మీ Listening skills, మీ Vocabulary ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. ఈక్రింది లింకులో మీకు అనేక ఉచిత ఆడియో బుక్స్ లభిస్తాయి.

ఉచితంగా audio books అందించే సైట్లు:

Speaking skills పెంపొందించుకోవడానికి మరొక ముఖ్యమైన టెక్నిక్ బిగ్గరగా చదవటం. దీన్ని మనం ‘Reading aloud’ అంటాము. Newspaper గాని, చందమామ పుస్తకంగాని బిగ్గరగా చదవడం వల్ల మనలో ఉన్న Speaking skills ఖచ్చితంగా మెరుగుపడతాయి.

మరొక ముఖ్యమైన విషయం. ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే వేగంగా మాట్లాడాలి అన్న ఒక భ్రమ జనాల్లో ఉంది. మీ యొక్క అభిప్రాయాలను, భావాలను ఎదుటివారికి ఇలా మామూలు వేగంతో మాట్లాడిన కూడా అందించవచ్చు… అంతే తప్ప చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇంగ్లీష్ సినిమాల్లో, న్యూస్ రీడర్స్, యాంకర్స్ లా అదే వేగంతో మాట్లాడాలి అనుకుంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మామూలుగా మాట్లాడటం నేర్చుకోండి. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ తప్పకుండా వేగంగా మాట్లాడటం దానంతట అదే వస్తుంది.  

Talk to yourself:

మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నపుడు ఏకాగ్రత అంతా ఆ పనిమీదే కేంద్రీకృతం కావడం వల్ల ఎటువంటి ఆలోచనలూ మనసులోకి రావు. అనవసరమైన ఆలోచనలైతే అసలే రావు. అదే మీరు ఎప్పుడైతే పని ఒత్తిడి లేకుండా ఖాళీగా ఉంటారో అపుడు మీ మనసులోకి అనేక రకాల ఆలోచనలు జోరబడుతుంటాయి. ఈ ఆలోచనల్లో చాలామటుకు ఏ మాత్రం ఉపయోగం లేనివిగా, కొన్ని మాత్రమే పనికొచ్చేవిగా ఉంటాయి. నిజానికి ఈ ఆలోచనల్లో ఎక్కువ శాతం ఉండే పనికి రాని ఆలోచనల పట్ల మన brain ఏ మాత్రం ఆసక్తి చూపదు కాబట్టి అవి లిప్తకాలంలోనే కనుమరుగై పోతాయి. అయితే చెత్త నుండి విద్యుత్తు ఉత్పత్తి చేసినట్లు ఈ పనికిరాని ఆలోచనల నుండి కూడా మనం ఇంగ్లీషు నేర్చుకోవచ్చు.

అదెలా?

మీరు ఓ రోజు ఆఫీస్ కి ప్రతీ రోజు వచ్చే సమయానికన్నా అనుకోకుండా చాలా ముందు వచ్చారు. అప్పటికీ ఆఫీస్ స్టాఫ్ ఎవరూ ఇంకా రాలేదు. అపుడు మీలో ఆలోచనల పరంపర (Stream of consciousness) ప్రారంభమవుతుంది. ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి?

“ ఏమిటబ్బా! ఈ రోజు చాలా ముందే వచ్చినట్టున్నాం. టైం ఎంతయిందబ్బా ! 8.45 am అంతేనా? అర్రే ! బహుశా రాత్రి వాచ్ లో time సెట్ చేసేటపుడు ఓ గంట ముందే సెట్ చేసినట్టున్నాం. అంతేనా? అంతే అయ్యుంటుంది. లేక ఈ రోజు ఆఫీస్ కి ఏమన్నా సెలవా? ఎందుకు సెలవై ఉంటుంది. సెలవైతే మనకి ఎవరూ చెప్పలేదేంటబ్బా! గిరిగాడు కూడా పోయిన సంవత్సరం ఇలాగే సెలవు రోజున ఆఫీస్ కి వచ్చానని ఎప్పుడూ చెప్తూంటాడు. సరే, సెలవైతే కాసేపట్లో తెలిసి పోతుందిలే. నిజంగా సెలవే అయితే ఎంచక్కా మార్నింగ్ షో కి వెళ్లిపోవచ్చు. ఎం సినిమాలు నడుస్తున్నాయబ్బా?”

ఇలా ఆలోచనలు అనంతంగా సాగిపోతుంటాయి. ఇక్కడ మనం చేయాల్సిందేమిటంటే ఆలోచనలు ప్రారంభం కాగానే ఒక్కో ఆలోచనని ఇంగ్లీషులోకి మారుస్తూ వెళ్ళడమే. ఏదైనా ఆలోచనని ఇంగ్లీషులోకి మార్చడం చాలా కష్టంగా అనిపిస్తే దానిని వదిలేసి next sentence లోకి వెళ్ళిపోవచ్చు.

“oh! I have come so early today. What is the time now? what! Only 8.45 am. I might have adjusted the watch one hour early, last night. Isn’t it? Or is it a holiday? Why holiday? But no one informed me. Giri keeps telling that he arrived to office on a holiday last year. Whatever it is! If it is a holiday, I can go for a morning show.”

Language Exchange Sites:

ఇది Advanced learnersకి మాత్రమే. మాట్లాడటంలో ఓ స్థాయికి వచ్చిన తరువాత మరింత మెరుగు పరుచుకోడానికి సరయిన అవకాశం కొరకు వెతుకుతున్నట్లయితే ఈ పద్ధతి మీ కోసమే. 

ప్రపంచవ్యాప్తంగా నలు మూలల నుండి వివిధ భాషలు నేర్చుకోవాలనుకునేవారు ఈ site లలో తమ వివరాలు నమోదు చేసుకుంటారు. మనం కూడా మన పేరు నమోదు చేసుకోవడం వల్ల మనలాగే ఆసక్తి ఉన్నవారితో సంభాషిస్తూ (skype లో) speaking skills ని పెంచుకోవచ్చు.

ఈ సైట్లలో రెండు రకాల వ్యక్తులు మనకి తారస పడతారు.

1. మాతృ భాష ఇంగ్లీష్ గా ఉండి (US,UK ) తెలుగు భాషని నేర్చుకునే ఆసక్తి ఉన్నవారు. వీరు తెలుగు నేర్పించే వారి కోసం అన్వేషిస్తూ ఉంటారు. వీరు ఇంగ్లీషు నేర్చుకోవాలనుకునే తెలుగువారితో skype, whatsapp calling లాంటి మార్గాల ద్వారా సంభాషిస్తూ ఇరువురూ పరస్పరం తమకి ఆసక్తి ఉన్న భాషలు మెరుగు పరుచుకోవచ్చు. (Spoken English in Telugu app) అసలు విదేశీయులకి తెలుగు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుందా అన్న సందేహం మీకు కలిగిందా?

 ఇలాంటి ఒక వెబ్ సైట్లో తెలుగు నేర్చుకోవాలనుకుంటున్న వారి కొరకు Search చేసినపుడు నాకు లభించిన ‘తెలుగు పట్ల ఆసక్తి కలవారి సంఖ్య’ 2184. అంటే ఇంత మంది మనతో ఇంగ్లీషులో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. దానికి బదులుగా మనం చేయాల్సింది చాలా సింపుల్, వారికి తెలుగు నేర్పించడమే.

2. Native speakers (USA, UK) తో మాట్లాడాలంటే భయపడే వారి కోసం మరో ఐడియా ఉంది. అదేమిటంటే ఇండియాకే చెంది ఇంగ్లీషు fluencyని improve చేసుకోవాలనుకుంటున్న వారిని ఫ్రెండ్ గా చేర్చుకుని వారితో సంభాషించడం. దీనివల్ల ఇరువురూ కూడా పరస్పరం ఇంగ్లీష్ speaking స్కిల్స్ ని పెంపొందించుకోవచ్చు.

తోటి తెలుగు వారితో మాట్లాడటం కన్నా ఇతర రాష్ట్రాల వారితో సంభాషించడమే మంచిది. ఎందుకంటే ఇరువురి మధ్య సంధాన భాష కేవలం ఇంగ్లీషు మాత్రమే. తెలుగు వారితో అయితే సంభాషణలో ఎక్కడైనా తడబడినపుడు తెలుగులోకి దిగిపోయే ప్రమాదం ఉంది.

కొన్ని Language Exchange Sites:

****                 ****                        ****

99 రోజుల Paid Spoken English Program

 

నేర్చుకోవాలన్న ఆసక్తి గలవారి కోసం సిరి అకాడెమి 99 రోజుల Paid Spoken English కోర్సుని whatsapp ద్వారా అందిస్తున్నది.

నిత్యజీవితంలో ఎదురయ్యేటటువంటి సందర్భాలు, అవసరాలకి తగ్గట్టుగా

అంటే ……….
• రిక్వెస్ట్ చేయడం, 
• ఇంటర్వ్యూలలో, షాపింగ్ చేసేటపుడు, ప్రయాణం చేసేటపుడు ఎలాంటి phrases ఉపయోగించాలి? 
• సలహాలు ఇవ్వడం, 
• సలహాలు అడగడం, 
• మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం, 
• ఇతరులను పరిచయం చేయడం లాంటి సందర్భాలలో ఎలాంటి వాక్యాలు
ఉపయోగించాలో చిన్న చిన్న వీడియోల ద్వారా నేర్పడం జరుగుతుంది.

ప్రతీరోజూ మీకు whatsapp ద్వారా ఒక video,
దానికి సంబంధించిన text పంపబడుతుంది.

Demo Lesson మరియు curriculum
(syllabus) కొరకు

దర్శించండి….

www.siriacademy.com

లేదా

94 94 277 340 Whatsapp లో
Message ద్వారా సంప్రదించండి.

You May Also Like

6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.