Improve Spoken Skills

Spoken English in Telugu

నాకు ఇంగ్లీషు రాయడం వచ్చు, చదవడం వచ్చు, అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేక పోతున్నాను, నేను ఏం చేయాలి?

ఇది మీరు ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు.

కొన్ని లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వాళ్లు,  గ్రూప్ డిస్కషన్ లలో పాల్గొనేవారు అడుగుతున్న ప్రశ్న ఇది.

మీతో పాటు ఎంతోమంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించి ఇంగ్లీష్ లో చక్కగా ఎలా మాట్లాడాలి అన్న దాని గురించి ఈ article లో చూద్దాము.

దీనికోసం మనం ఒక ఉదాహరణ చూద్దాం.

మీకు జ్వరం వస్తుంది. బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. వెంటనే ఒక పారాసెటమాల్ బిళ్ళ వేసుకుంటారు. కాసేపు అయిన తర్వాత తగ్గిపోతుంది.

తెల్లవారి మళ్లీ ఒళ్ళు వెచ్చబడుతుంది. మళ్ళీ పారాసెటమాల్ బిళ్ళ వేసుకుంటారు, మళ్ళీ తగ్గిపోతుంది.

ఇలా రెండు మూడు రోజులు గడిచిన తరువాత అప్పుడు మీరు డాక్టర్ వద్దకు వెళతారు.

డాక్టరు ‘అసలు జ్వరం ఎందుకు వస్తుంది’ అన్న విషయాన్ని గుర్తించి Diagnose చేస్తాడు.

ఆ కారణాన్ని బట్టి, మీకొచ్చిన జ్వరానికి చికిత్స మొదలు పెడతాడు. అంటే ‘ఎందువల్ల జ్వరం వస్తుంది’ అన్న దానికి చికిత్స చేస్తాడు. ఇలా మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే మళ్లీ జ్వరం రావడం అంటూ ఉండదు.

“ఏ సమస్య అయినా దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు, దాని మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది.”

అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.

ముందుగా ‘మీరు ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు’ అనే దానికి మూలకారణం గుర్తించాలి.

ఇంగ్లీష్ లో ఉన్న సంభాషణలను అర్థం చేసుకోవడం అనేది Knowledge (జ్ణానం).

ఇంగ్లీష్ లో మాట్లాడటం అనేది ఒక Skill.

స్కిల్ అంటే ఏమిటి?

స్కిల్ అంటే నైపుణ్యం …..కదా!

మరి Knowledge కి, స్కిల్ కి తేడా ఏమిటి?

Knowledge అంటే ఒక విషయం గురించి తెలిసి ఉండడం, అవగాహన కలిగి ఉండడం.

Skill అంటే ప్రాక్టికల్ గా చేయగల సామర్థ్యం.

చేస్తూ చేస్తూ ఉండగా వచ్చేది skill. అందుకే వీటిని మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటామే తప్ప కమ్యూనికేషన్ నాలెడ్జ్ అని అనడం జరగదు.

ఉదాహరణకి,

“డ్రైవింగ్ నేర్చుకోండి” అన్న పుస్తకం చదవడం పూర్తిచేసి, కారు తీసుకుని మీరు ధైర్యంగా రోడ్డుపైకి వెళ్లగలరా?

లేదు కదా!

అలాగే,  “స్విమ్మింగ్ నేర్చుకోవడం ఎలా?” అన్న పుస్తకం చదివి నదిలో ఈత కొట్టగలరా?

లేదు కదా!

ఎందుకంటే పుస్తకం చదివితే వచ్చేది నాలెడ్జ్. Skill కాదు.

అలాగే డ్రైవింగ్ నేర్పించేటప్పుడు instructor ఏం చేస్తాడు?

మీకు డ్రైవింగ్ ఎలా చేయాలో చెప్తాడు, techniques నేర్పిస్తాడు, ఎక్కడ మీకు ఇబ్బందులు ఎదురవుతాయో చెప్తాడు, సూచనలు ఇస్తాడు.

 కానీ నేర్చుకోవాల్సింది మాత్రం మీరే. తను కేవలం మీకు Knowledge మాత్రమే ఇవ్వగలుగుతాడు. నేర్చుకోవాల్సింది మీరే.

పుస్తకాలు చదువుతే వచ్చేది నాలెడ్జ్. స్వయంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేది skill.

డ్రైవింగ్ ఎలా చేయాలి అన్న Knowledge తో పాటు, ఆ డ్రైవింగ్ నిజంగా చేయగల Practical Experience ఉంటే వచ్చేది స్కిల్.

ఇంగ్లీష్ లో మాట్లాడటం అనేది ఒక skill.

Skill లేని Knowledge అంత పెద్దగా ఉపయోగం లేనిది.

అందువల్ల ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే చేయాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన పని

“ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలు పెట్టడం.”

దురదృష్టవశాత్తు, చాలా మంది విద్యార్థులు ఈ విషయం పై ఫోకస్ చేయకుండా “నాకు ఇంగ్లీష్ రావడం లేదు” అంటూ దిగులు చెందుతుంటారు. అయితే ఈ “ఇంగ్లీషులో మాట్లాడటం ఎలా మొదలు పెట్టాలి?” అన్న దాని గురించి మనం మరొక వ్యాసంలో చర్చిద్దాం.

***********************************************************************************************************************************************

Spoken English నేర్చుకోవాలన్న ఆసక్తి గలవారి కోసం సిరి అకాడెమి 99 రోజుల Spoken English కోర్సుని whatsapp ద్వారా అందిస్తున్నది.

 

నిత్యజీవితంలో ఎదురయ్యేటటువంటి సందర్భాలు, అవసరాలకి తగ్గట్టుగా

అంటే ……….
• రిక్వెస్ట్ చేయడం, 
• ఇంటర్వ్యూలలో, షాపింగ్ చేసేటపుడు, ప్రయాణం చేసేటపుడు ఎలాంటి phrases ఉపయోగించాలి? 
• సలహాలు ఇవ్వడం, 
• సలహాలు అడగడం, 
• మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం, 
• ఇతరులను పరిచయం చేయడం లాంటి సందర్భాలలో ఎలాంటి వాక్యాలు ఉపయోగించాలో చిన్న చిన్న వీడియోల ద్వారా నేర్పడం జరుగుతుంది.

Demo Lesson మరియు curriculum (syllabus) కొరకు

 

దర్శించండి….

www.siriacademy.com

లేదా

94 94 277 340 Whatsapp లో message ద్వారా సంప్రదించండి.

 

You May Also Like

26 Comments

  1. Hai
    I am sangu
    My problem is also same for above mentioned..
    So please tell me what to do, tell me ur suggestion, I will waiting for ur answer…
    Thank u

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.