do not run from english

English నుండి పారిపోకండి…

పోటీ పరీక్షల్లో ఇంగ్లీషులో మంచి స్కోరు సాధించాలంటే ఏం చేయాలి?

చాలామంది విద్యార్థులను, ముఖ్యంగా తెలుగు వారిని, వేధిస్తున్న ప్రశ్నే ఇది.

కేవలం క్వాలిఫై అయిపోతే చాలు అనుకునే పోటీ పరీక్షలు కొన్ని ఉండగా అంతటితో ఆగకుండా మంచి స్కోరు సాధిస్తేనే సక్సెస్ లభించే పరీక్షలు కొన్ని ఉంటాయి. గ్రూపు I లాంటి ఉన్నత స్థాయి పరీక్షల్లో కూడా మిగతా పేపర్లు అద్బుతంగా చేసి కేవలం క్వాలిఫై అవ్వాల్సిన ఇంగ్లీషులో చతికిలపడినవారి గురించి మనకు తెలుసు.

ఇక రాష్ట్రస్థాయి దాటి జాతీయ స్థాయి పరీక్షల విషయానికొస్తే IBPS, RRB, SSC లాంటి వాటిలో మనవాళ్ళు కొద్దిమంది మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. వీటిలో ఉండే అనేక పేపర్లలో ఇంగ్లీషు ఒకటి మాత్రమే అయినప్పటికీ అదే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఈ ఇంగ్లీషుపై ఉన్న భయంతో అసలా పరీక్షల వైపు చూడటమే మానేశారు చాలామంది. ఇక TOEFL, IELTS లాంటి అంతర్జాతీయ పరీక్షల గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు.

అలాగని ఎవ్వరికీ Selection రావడం లేదని కాదు. కష్టపడి ఈ పరీక్షల్లో మంచిస్కోరు సాధించినవారు ఎంతోమంది ఉన్నారు. భయంతో వాటికి దూరంగా ఉంటున్నవారి కోసమే ఈ ఆర్టికల్.

మనవాళ్ళు ముఖ్యంగా రెండు Mediaల నుండి వచ్చిన వారై ఉంటారు.

  • 1. English medium
  • 2. Mothertongue (తెలుగు మీడియం, ఉర్దూ, హిందీ, మరాఠీ….etc)

సాధారణంగా English medium విద్యార్థులు ఇంగ్లీషులో బాగా మాట్లాడగలుగుతారు. వారి writing skills, గ్రామర్ గురించి మనం చెప్పలేము గానీ స్పోకెన్ skills బాగానే ఉంటాయి. ఇది వారికి ఒక plus point.

ఇతర మీడియా విద్యార్థులు తమని వీరితో పోల్చుకొని తమ స్పోకెన్ skills అంత బాగా లేవని భావించడం కూడా సహజంగానే జరుగుతున్నది.

ఇంగ్లీషు అంటే భయానికి ఇదొక బీజం.

ఇదొక్కటేకాక అనేక ఇతర కారణాల వల్ల చాలామందిలో “ఇంగ్లిషోఫోబియా” ఏర్పడింది.

అంటే ఇంగ్లీషు అంటే భయం. దాని పేరు వింటేనే ఆమడ దూరం పరిగెట్టడం.

“నాకు ఇంగ్లీషు రాదు”

అనేకమంది విద్యార్థులు తమంతట తాము Decide చేసుకున్న విషయమిది.

“ఇక ఏం చేసినా మాకు ఇంగ్లీషు రాదు, కాబట్టి మేము ఆ విషయంలో ఏ ప్రయత్నమూ చేయము, చేసినా అది వృధా అని మాకు ముందే తెలుసు.”

అందుకేఇంగ్లీషు లేని పోటీ పరిక్షలు ఏమైనా ఉన్నాయా? అని వెతకడం…

లేదంటే

ఇంగ్లీషుకున్న weightage తీసేయాలని ధర్నాలు చేయడం, లేదంటే పరీక్ష రాసొచ్చి మనం టిక్ చేసిన జవాబులన్నీ కరెక్ట్ అవ్వాలని భగవంతుడిని వేడుకోవడం …..ఇవే వీరు చేసే పనులు.

ఇంతకుమించి మనం ఏమీ చేయలేమా ?

స్వామి వివేకానంద ఒకమాట చెప్పారు. దీని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

“If we face our problems instead of running away from them, they will run away”

దీనినే ఇంగ్లీషుకి apply చేస్తే…

ఇంగ్లీషు నుండి దూరంగా పరిగెట్టడం మానేసి దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతమవుతుంది.

ముందుగా కావలసింది ఇంగ్లీషు కాదు. అంతకన్నాముఖ్యంగా ఇంగ్లీషు గురించి మీ attitude మారాలి. దానితరువాత ఇంగ్లీషు దానంతట అదే వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.

అదృష్టవశాత్తూ విద్యార్థులకి భారీ స్థాయిలో కంటెంట్ (మెటీరియల్) లభిస్తున్నది. కేవలం పుస్తకాల రూపంలోనే కాదు online లో ఈ క్రింది అనేక format లలో కంటెంట్ దొరుకుతున్నది.

  • Pdf
  • Mp4 (videos) (Spoken English videos in Telugu)
  • Mp3 (audio)
  • Ppt (power point presentations)
  • Text
  • Flash animations

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఈ format ల వల్ల ప్రయోజనమేమిటంటే మీకు నచ్చిన format ని ఎంచుకొని ఇంగ్లీషు నేర్చుకోవచ్చు.

కావలసింది స్థిరత్వం.

అంటే start చేసి రెండురోజులు బ్రహ్మాండంగా కంటిన్యూ చేసి మూడో రోజు మానేయడం కాదు. స్థిరంగా ప్రతీరోజూ కొనసాగించడం. రోజుకి కనీసం అరగంట అయినా సరే.

ఒక పనిని ప్రతీరోజూ చేస్తూ ఓ 40 రోజులు కొనసాగిస్తే అది ఒక అలవాటుగా మారుతుందని అంటారు, అది నిజం కూడా. అయితేదానికి ముందుగా కావాల్సింది సాధించాలన్న తపన, ఆ will power. అయ్యప్ప, సాయి బాబా, దుర్గాదేవి దీక్షల వెనక మర్మం కూడా ఇదే.

అసలు చిక్కల్లా ఆరంభ శూరత్వంతోనే. మొదలు పెట్టిన పనిని తుదికంటా కొనస్సగించడమే ఇక్కడ కావలసింది.

⇒ మరిన్ని విలువైన Spoken English Articles కొరకు మా Site ని దర్శించండి…  https://siriacademy.com

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.