Spoken English in Telugu

Spoken English videos in Telugu: Learn through movies

Spoken English videos in Telugu

Spoken English videos in Telugu: Learn through movies

 

స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది భారంగా, ఏదో తప్పనిసరైన బాధ్యతలా కాకుండా, సరదాగా, సంతోషంగా, ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటే ఎలా ఉంటుంది?

ఇలా సరదాగా నేర్చుకోగలిగే ఓ టెక్నిక్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.

 

సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు?

మన అందరికీ ఇష్టమే కదా!

అలా సినిమా చూస్తూ, ఎంజాయ్ చేస్తూ, అదే సమయంలో స్పోకెన్ ఇంగ్లీష్ మెరుగుపరుచుకుంటే ఎలా ఉంటుంది?

ఈ టెక్నిక్ చాలా సింపుల్.

దీనికోసం (టీవీ కంటే కూడా) మొబైల్ గాని కంప్యూటర్ గాని ఉపయోగిస్తాము. ఎందుకంటే వీటిలో Pause చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటిలో సినిమా చూడటం మొదలు పెడతాము. ఇదివరకు చూసిన సినిమా అయితే మరీ మంచిది. ఎందుకంటే ‘సినిమాలో ఏమి జరుగబోతున్నది’ అన్నదానికంటే కూడా మన Activity పైనే ఫోకస్ చేయవచ్చు.

 

ఇక Activity మొదలుపెడదాం.

సినిమా చూస్తున్నప్పుడు డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా………….అక్కడక్కడా ఒక్కో డైలాగ్ ని తీసుకొని ఇంగ్లీషులోకి translate చేసే ప్రయత్నం చేయాలి.

మీరు ఒక్కరే గనక ఉంటే గట్టిగా బయటకి పలకండి. మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది.

 

ప్రతి ఒక్క డైలాగ్ ని translate చేసి ఇంగ్లీష్ లోకి మార్చాల్సిన అవసరం లేదు. Random గా అక్కడక్కడ ఒక్కొక్క డైలాగ్ తీసుకొని మొదలుపెట్టవచ్చు.

ఇప్పుడు, ఒక డైలాగ్ ని translate చేయడం వీలుకాలేదు. అలా ముందుకు వెళ్తుండగా చాలా డైలాగులు మీరు ఇంగ్లీషులో translate చేయలేకపోతారు.

ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి?

దీనికి ఒక మంచి టెక్నిక్ ఉంది.

 

Youtube లో లభించే కొన్ని తెలుగు సినిమాలకు ఇంగ్లీషు సబ్ టైటిల్స్ కూడా లభిస్తాయి. వీటిలో ప్రతి డైలాగ్ కి కింద English లో Subtitle డిస్ ప్లే అవుతూ ఉంటుంది. ఇలా మీరు వీలైనన్ని డైలాగులు చూస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, మీవల్ల కానివాటిని నేర్చుకుంటూ, Activity కంటిన్యూ చేయవచ్చు.

దీనివల్ల ఒక మంచి Benefit ఏమిటంటే నిత్యజీవితంలో వాక్యాలు చెప్పాల్సి వచ్చినప్పుడు, ఏం మాట్లాడాలి? అన్న తికమక లేకుండా వేగంగా React కాగలుగుతాము. ఏవైతే వాక్యాలు మీరు చేయలేకపోతారో, వాటిని notebook లో రాసుకుని వీలైనన్నిసార్లు ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి.

 

కొన్ని సినిమాలు:

 

  1. https://www.youtube.com/watch?v=EP_wJ1NG7t0

 

  1. https://www.youtube.com/watch?v=cKXUf_Riqgw

 

  1. https://www.youtube.com/watch?v=OvSQAyKXxEw

 

  1. https://www.youtube.com/watch?v=5zhXyy0XYao

 

  1. https://www.youtube.com/watch?v=wl7FV1LHcU4

 

వెతికితే ఇలాంటి సినిమాలు చాలా లభిస్తాయి.

 

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *