Blog

Spoken English in Telugu: 5 Tips

Spoken English in Telugu: 5 Tips (#Spoken English from Telugu )

ఇంగ్లీషులో మాట్లాడాలన్న కోరిక కలగానే ఉండిపోతోందా?

ఇంగ్లీషులో సరిగ్గా మాట్లాడలేకపోతున్నానన్న సందేహంతో ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా?/

Spoken English in Telugu
Spoken English in Telugu

 

అయితే మీకోసమే ఈ చిట్కాలు.

1. విశ్వాసం:

ఏదైనా ఓ ఔషధం పని చేయాలంటే ముందుగా కావలిసింది నమ్మకం. ఆ మందు సరిగ్గా పనిచేస్తుందన్న నమ్మకం. ఇదే – – – – –

ప్లాసేబో ఎఫెక్ట్ (Placebo Effect).

 

మీ ఫ్రెండ్ ఒకడిని పాము కరిచింది. అది మామూలు పామేనని, విషం లేనిదని మీకు తెలుసు.

ఆ సమయంలో ప్రాణభయంతో గజగజ వణుకుతున్నవాడికి “నూటికి 90 శాతా పాములు విషం లేనివి, నిన్ను కరిచింది కూడా అలాంటి పామే”నని ఎంత నచ్చజెప్పినా వాడి తలకెక్కదు. అదే, ఏదో ఒక ఇంజక్షన్ ని విషానికి విరుగుడు అని చెప్పి ఇచ్చామనుకోండి, చప్పున లేచి కూర్చుంటాడు. ఇక్కడ పని చేసింది నమ్మకమే. ఆ ఇంజక్షన్ ఇవ్వలేదనుకోండి ..ఏమవుతుందో మీరు ఊహించుకోవచ్చు.

మనం రోజూ ఎన్నో బ్లాగుల్లో, వార్తా పత్రికల్లో, institute లలో ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఎన్నో పద్దతులు, టెక్నిక్స్ చూస్తూ ఉంటాం. వాటిని చూసినట్లే చూసి పక్కన పారేస్తాం, అంతేతప్ప అమలు పరచడం అంటూ జరగదు. ఎందుకంటే మనకి వాటివల్ల ఇంగ్లీషు నేర్చుకోవచ్చన్న నమ్మకం ఏమాత్రం లేదు.

ఎప్పడైతే మనం ఇది తప్పకుండా జరుగుతుంది అని గట్టిగా విశ్వసిస్తామో అప్పుడే మరింత బలంగా ప్రయత్నిస్తాము. ఇది జరగదు అని అనుకున్నప్పుడు ‘ఎంత త్వరగా వొదిలేస్తే అంత మంచిది’ అని మనస్సు, శరీరం, బుద్ధి ఇవన్నీ కూడా అనుకోవడం మొదలుపెడతాయి. అందుకే ఆ పని సడలిపోయి మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. అందుకనే ఇంగ్లీషు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా కలిగి ఉండాల్సింది నమ్మకం, ‘నేను నేర్చుకొని తీరతాను’ అన్న సంకల్పం.

 

2. ఇంగ్లీషు వాతావరణంలోకి ప్రవేశించండి:

 

మీచుట్టూ ఎటు చూసినా ఇంగ్లీషు మాత్రమే ఉండేలా, అది తప్ప ఇతర ఏ భాషలూ లేకుండా జాగ్రత్త పడండి.

 • ఇంగ్లీషు మాట్లాడే స్నేహితులు
 • ఇంగ్లీషు newspaper
 • ఇంగ్లీషు టీవీ చానల్స్
 • ఇంగ్లీషు సినిమాలు
 • ఇంగ్లీషు పుస్తకాలు
 • Spoken English from Telugu Youtube Videos

3 . ప్రాక్టీసు చేయండి:

మనలో చాలామంది ఇంగ్లీషులో బాగా రాయగలుగుతారు.

మరికొందరు ఇంగ్లీషులో బాగా ఆలోచించగలుగుతారు కూడా.

కానీ ఎప్పుడైతే ఇతరులతో నిజ జీవితంలో మాట్లాడాల్సి వస్తుందో అప్పుడు మాత్రం తడబడటం, పదాల కోసం తడుముకోవడం, ఇంగ్లీషుని ఆపేసి తెలుగులోకి వెళ్ళిపోవడం చేస్తారు.

 

“ఛీ….అనవసరంగా ఇంగ్లీషులో మాట్లాడాము…మాట్లాడకున్నా బాగుండేది “ అని సిగ్గుగా ఫీల్ అవుతారు కూడా.

 

చక్కగా రాయగలిగినవారు, ఆలోచించగలిగినవారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?

దానికి కారణం ప్రాక్టీసు లేకపోవడమే.

 

కేవలం పుస్తకాలు చదివి నేర్చుకొని ఇంగ్లీషులో మాట్లాడటం సాధ్యం కాదు. దీనికి ప్రాక్టీసు చేయడం కూడా అవసరం. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే మీ నాలుక, నోరు కూడా ఇంగ్లిషుకి అలవాటు పడాల్సి ఉంటుంది.

కాబట్టి వీలయినంత ప్రాక్టీసు చేయాలి.

ప్రాక్టీసు ఎలా చేయాలి?

 

గ్రూపుతో : ఇంగ్లీషులో మాట్లాడటానికి మీకు స్నేహితులు గనక ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే. మీ పని మరింత సులువవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏదో ఒక టాపిక్ గురించి (అదెంత పనికిమాలిందైనా సరే) వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఇది ఇంగ్లీషులో Spoken skills పెంపొందించుకోవడానికి ఒక సులువైన దారి.

ఒంటరిగా:

చాలా సందర్భాల్లో మీకు మాట్లాడటానికి తోడు దొరక్కపోవచ్చు. ప్రోత్సహించడం అటుంచి ఎగతాళి చేస్తూ వెనక్కి లాగేసేవాళ్ళు కోకొల్లలుగా మీచుట్టూ ఉండి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఒంటరిగానే ప్రాక్టీసు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఒక నిలువుటద్దం ముందు నిల్చొని ఒక్కో డైలాగుని గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. ఇది కూడా మంచి టేక్నికే.

ఒక్కరే మాట్లాడుకోవాల్సి రావడం వల్ల కొంత ఇబ్బందిగా అనిపించినా- – – –  తప్పదు మరి.

 

4. గ్రామరుని పక్కనపెట్టండి: (Spoken English in Telugu )

 

ఇంగ్లీషులో మాట్లాడాలంటే తప్పనిసరిగా గ్రామరు నేర్చుకోవాలన్న అపోహ చాలామందిలో ఉంది. నిజానికి తప్పులు లేకుండా రాయడానికి, భాషను ఒక క్రమ పద్దతిలో నేర్చుకోడానికి గ్రామరు సహాయం చేస్తుందే తప్ప కేవలం spoken English నేర్చుకోవడానికి గ్రామరు compulsory ఏమీ కాదు.

మరి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి?

ముందుగా phrases, sentences తో మొదలుపెట్టండి.

రోజూ మీకు నచ్చిన సంఖ్యలో కొన్ని sentences తీసుకొని వాటిని ప్రాక్టీసు చేయండి. నెమ్మదిగా ఈ sentences కి అలవాటు పడితే ఎక్కువసేపు కూడా ఇంగ్లీషులో మాట్లాడగలుగుతారు.

5. ఒక పద్దతి ప్రకారం నేర్చుకోండి.

 

ఏం నేర్చుకుంటున్నారో రోజూ నోట్ చేసుకోండి.

ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది. ఇతరులు అంటే trainers కావొచ్చు, స్నేహితులు కావొచ్చు, institute కావొచ్చు, పుస్తకం కావొచ్చు లేక video కోర్సు అయినా కావొచ్చు.

ఇలా నోట్ చేసుకుంటూ ఉంటె ఏరోజు ఏం నేర్చుకుంటున్నారో ఒక అవగాహన ఉంటుంది. లేకపోతె ఒకే టాపిక్ పై అనేక రోజులు అనవసరంగా వృధా చేసే ప్రమాదముంది.

ఎక్కడి నుండి మొదలుపెట్టి ఎటు వెళ్తున్నామో తెలియకుండా నేర్చుకుంటే మన మీద మనకే సందేహం కలిగే అవకాశం ఉంది. అందుకే ఒక క్రమ పద్దతిలో నేర్చుకోవడం అవసరం.

ఉదాహరణకు….

 

 • Day 21   సలహా ఇవ్వడం

 

 • Day 22   క్షమాపణ చెప్పడం

 

 • Day 23   (orders) ఆదేశాలు ఇవ్వడం

 

ఇలా నేర్చుకోవచ్చు.

 

ఇలా ప్రతీరోజూ క్రమం తప్పకుండా Spoken English నేర్చుకోడాన్ని ఒక సరదాగా మార్చడానికి సిరిఅకాడెమీ ప్రవేశపెడుతున్నది “Spoken English through whatsapp” కోర్సు. (#Spoken English in Telugu ).

 

“Spoken English through whatsapp” కోర్సు:

ఈ కోర్సు ప్రత్యేకతలు:

 •  99 రోజుల కోర్సు.
 • మావద్దకి ప్రత్యేకంగా రానక్కరలేదు.
 • మీ అంతటా మీరే ఇంటివద్ద నేర్చుకోవచ్చు.
 • ప్రతీరోజూ మీ మొబైల్ కి whatsapp ద్వారా content పంపించబడుతుంది.
 • దీనివల్ల ఇంగ్లీష్ నేర్చుకోవడమనేది ఏదో రెండు రోజుల ముచ్చటలా కాకుండా 99 రోజుల పాటు మీకు ఒక మంచి అలవాటుగా మారిపోతుంది. ఏదో కారణం వల్ల మధ్యలో మానివేసే ప్రసక్తే ఉండదు.
 • సులభమైన పాఠ్యాంశాలు. Text, audio, video content.
 • spoken english classes in telugu.
 • రోజుకి కేవలం రెండు రూపాయలు మాత్రమే.
 • ఇంత తక్కువ ధరకి, ఇంత విలువైన కోర్సు మార్కెట్లో మరెక్కడా లభించదు. మీ పెట్టుబడికి అనేక రెట్లు విలువైన టెక్నిక్కులు మీ సొంతమవుతాయి.
 • Videosని Download చేసుకొవచ్చు. మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు, వినవచ్చు, చూడవచ్చు.

 

ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

REGISTRATION PROCESS

 

Please follow and like us:

22 thoughts on “Spoken English in Telugu: 5 Tips

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *