BlogSpoken English in Telugu

Should – Usage: Spoken English in Telugu

ఈరోజు మనం ఈ వీడియోలో Should ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

Should తర్వాత ఎల్లప్పుడు కూడా Verb యొక్క మొదటి రూపం అయినటువంటి V1 మాత్రమే వస్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం.

 

  • సందర్భాలలో మనం Should ను ఉపయోగిస్తాము.

1. Advice:

Advice అంటే సలహా ఇవ్వడం. దీనిని మనము రికమండేషన్ అని కూడా అనొచ్చు.

 

నిజానికి advice కి, రికమండేషన్ కి మధ్య స్వల్పంగా తేడా ఉంటుంది. Advice అంటే సలహా ఇవ్వడం, రికమండేషన్ అంటే సిఫార్సు చేయడం.

 

స్వల్ప తేడా మినహాయిస్తే ఈ రెండు కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయి.

 

Advice: ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ advice, రెండవది నెగటివ్ advice.

 

అంటే “ఒక పని చేస్తే బాగుంటుంది” అని చెప్పడానికి పాజిటివ్ advice ని ఉపయోగిస్తాము. “ఫలానా పని చేయకుండా ఉంటే బాగుంటుంది” అని చెప్పడానికి నెగటివ్ advice ని ఉపయోగిస్తాము.

 

ఉదాహరణ గనుక చూసినట్లైతే….

 

You should work hard.

నువ్వు మరింత కష్టపడాలి.

 

అనే అర్ధాన్నిస్తుంది. దీనినే గనక మనము నెగటివ్ advice గా మార్చినట్లయితే…

 

 You shouldn’t work hard.  (You should not work hard.)

“నువ్వు ఎక్కువగా కష్ట పడకూడదు.”

 

అని చెప్పినట్టు అవుతుంది.

 

 

మరికొన్ని ఉదాహరణలు చూసినట్టయితే……

 

He should see a doctor.

 

అతను డాక్టర్ని కలిస్తే బాగుంటుంది అనే అర్ధాన్నిస్తుంది.

 

 

ఈ సలహా ఇచ్చే పద్ధతిని మరింత సున్నితంగా చేయడానికి ఈ వాక్యం ముందర మనం “I think” అనే phrase ని జోడించవచ్చు. అప్పుడు వాక్యం ఎలా ఉంటుందంటే…..

 

I think you should attend the meeting.

 

I think you should work hard.

 

I think he should see a doctor.

 

ఇలా ఇలా మనం సలహాలు ఇవ్వొచ్చు.

 

 

అలాగే ఇంత ముందు చెప్పుకున్నట్టు “Not” జోడించి నెగటివ్ సలహా కూడా ఇవ్వొచ్చు.

 

ఇక రికమండేషన్ గురించి చూడాల్సి వచ్చినప్పుడు….

 

When you go to Hyderabad you should visit Salarjung museum.

 

మీరు హైదరాబాద్ గనక వెళ్తే అక్కడ సాలార్జంగ్ మ్యూజియం చూడండి.

 అని మనం రికమండ్ చేస్తున్నామన్నమాట.

 

ఇవన్నీ కూడా మొదటి కేటగిరీ అయినటువంటి advice కిందికి వస్తాయి.

 

2. ఇక రెండవ కేటగిరిలో Obligation వస్తుంది. Obligation అంటే బాధ్యత, తప్పనిసరిగా చేయాల్సిన పనులు.

 

ఉదాహరణ గనుక చూసినట్లైతే …..

 

I should be there by 6pm.

 

నేను అక్కడ ఆరుగంటల్లో గా ఉండాలి.

 

నేను అక్కడ ఆరుగంటల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అది నా బాధ్యత అనే అర్థం ఇక్కడ కనిపిస్తుంది.

 

 

ఇంకొక ఉదాహరణ గనుక చూసినట్లైతే….

 

Passengers should arrive two hours before their flight departure.

 

ప్రయాణికులందరూ కూడా వాళ్ల ఫ్లైట్ డిపార్చర్ కంటే రెండు గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి.

 

 

ప్రయాణికులు రెండు గంటలు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవడం అనేది వాళ్ళ యొక్క బాధ్యత. ఈ విధంగా should ని Obligation అనే అర్థంలో కూడా ఉపయోగించవచ్చు.

 

ఈ Obligation కి నెగటివ్ రూపము ఉండదు. ఇంత ముందు మనము advice లో చూసినట్టు ఇక్కడ మాత్రం నెగిటివ్ రూపం ఉండదు.

 

SiriAcademy.com

 

3. ఇంక మూడోది, చిట్టచివరిది Expectations.

 

Expectations అంటే ఊహించడం.

 

ఫలానా సమయానికి ఫలానా విషయం జరుగుతుంది అని ఊహించడాన్ని మనం Expectations కింద చూస్తాము.

 

ఉదాహరణకి………

 

By now, they should already be in Chennai.

 

ఈ సమయానికి వాళ్ళు చెన్నైలో ఉండి ఉంటారు.

చెన్నైకి చేరుకొని ఉంటారు అని మనం ఊహిస్తున్నామన్న మాట.

 

 

మరొక ఉదాహరణ గనుక చూసినట్లైతే

 

The bus should be here soon.

 

ఆ బస్సు ఏ క్షణంలోనైనా ఇక్కడికి చేరుకోవచ్చు.

 

 ఈ విధంగా మూడు సందర్భాల్లో should ను ఉపయోగించడం జరుగుతుంది.

 

Please follow and like us:

4 thoughts on “Should – Usage: Spoken English in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *